Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

​​చేతికి కట్టు, పక్కనే భార్యతో జూనియర్ ఎన్టీఆర్ పెళ్లిరోజు ఫొటో వైరల్

  • సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన
  • శుభాకాంక్షలు చెబుతున్న ఫ్యాన్స్
  • వేలల్లో లైకులు, షేర్లు
టాలీవుడ్ లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ముందువరుసలో ఉంటారు. గత కొన్నేళ్లుగా ఆయన నటిస్తున్న చిత్రాల్లో పరాజయం పాలైనవి చాలా తక్కువ. తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటూ ప్రతి సినిమాకు కొత్తదనం చూపించేందుకు ప్రయత్నిస్తూ విజయాన్ని అందుకుంటున్నారు. ఇవాళ తారక్ పెళ్లిరోజు కావడంతో సినీ ప్రముఖులు, బంధుమిత్రులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఈ నందమూరి హీరో కూడా తన వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకుని భార్య లక్ష్మీప్రణతితో ఉన్న ఫొటోను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ ఫొటోలో జూనియర్ ఎన్టీఆర్ చేతికి కట్టుతో కనిపించారు. ఇటీవలే ఆయనకు ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ సందర్భంగా గాయమైంది. దాంతో కుడిచేయి మణికట్టును కవర్ చేస్తూ బ్యాండేజ్ ధరించారు. పక్కనే అర్ధాంగి లక్ష్మీపార్వతి చిరునవ్వులు చిందిస్తున్నారు.

కాగా, ఈ ఫొటోకు తారక్ క్యాప్షన్ కూడా ఇచ్చారు. తమ పెళ్లయి ఎనిమిదేళ్లయిందని, ఇలాంటి మధుర క్షణాలు మరెన్నో రావాలని ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ పోస్టు పెట్టారో లేదో అభిమానులు విపరీతంగా స్పందిస్తున్నారు. వేల సంఖ్యలో లైకులు, షేర్లతో ఫేస్ బుక్ ను హోరెత్తిస్తున్నారు.2011లో ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి పెళ్లి జరిగింది. వీరికి అభయ్ రామ్, భార్గవరామ్ అనే కుమారులున్నారు.
Jr Ntr
Tollywood

More Telugu News